కొత్త ఏడాది తొలి రోజు కూడా జగన్?

కొత్త ఏడాది తొలిరోజు జగన్ నడకలోనే ఉంటారు. పాదయాత్ర ఈరోజు కూడా ప్రారంభమయింది. కొత్త సంవత్సరం కావడంతో పెద్దయెత్తున వచ్చిన ప్రజలు జగన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో యాత్ర ఇంకా సాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలకు జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 సంవత్సరం ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, సుఖసంతోషాలతో ఉండాలని జగన్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మంచి మార్పులు రావాలని ఆయన కోరారు.
దారిపొడవునా శుభాకాంక్షలు.....
నేగు జగన్ పాదయాత్ర 49వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు నుంచి ప్రారంభమైంది. ముదివేడు నుంచి కడప క్రాస్ రోడ్స్, నడింపల్లి, ఆర్.సి. కురవపల్లి, గడ్డెత్తుపల్లి, నల్లగుట్టపల్లి, కాయలపల్లి, అడ్డగింతవారి పల్లి, చిలకవారి పల్లి, రేగంటి వారిపల్లి, సీటీఎం క్రాస్ రోడ్స్ మీదుగా యాత్ర కొనసాగుతోంది. రాత్రికి జగన్ సీటీఎం వద్దనే బస చేయనున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జగన్ రోజుకు 14 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారు. నిన్న 14.5 కిలోమీటర్ల మేరకు ఆయన నడిచారు. దారిలో ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో ఈరోజు జగన్ ను అడుగడుగునా ప్రజలు ఆయన వద్దకు వచ్చి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతుండటంతో యాత్ర నెమ్మదిగా సాగుతోంది.
- Tags
- జగన్

