Wed Mar 25 2026 20:20:44 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ ను కంటికి రెప్పలా చూసుకున్నారని

కేసీఆర్ ను కంటికి రెప్పలా చూసుకున్నందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ నేడు రాజ్యసభ సభ్యుడయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచే సంతోష్ కుమార్ కేసీఆర్ వెంట ఉన్నారు. ఆయనకు ఒకరకంగా పర్సనల్ సెక్రటరీగా ఉన్నారని చెప్పొచ్చు. కేసీఆర్ కు దగ్గర బంధువు అయ్యే సంతోష్ కుమార్ తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ పార్టీ జెండా రూపకల్పన దగ్గర నుంచి ఆయన పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు.కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు కూడా నిమ్స్ ఆసుపత్రిలో సంతోష్ ఆయన వెంటే ఉండి అన్ని సపర్యలూ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన సంతోష్ కుమార్ చిన్న వయసులోనే పెద్దల సభకు ఎన్నికయ్యారు. సంతోష్ కుమార్ కు రాజ్యసభ కు ఎంపిక కావడంతో టీఆర్ఎస్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా...కేసీఆర్ సంతోష్ కు రాజ్యసభ అభ్యర్థిత్వం కట్టబెట్టారు.
.
Next Story

