కేదార్ నాథ్ ఆలయంలో మోడీ ఏం చేశారంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరాఖండ్ లోనికేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ ఆలయం రేపు మూసేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ కేదార్ నాధ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ క్షేత్రం వద్ద అనేక ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. దీపావళి పర్వదినాన్ని నిన్న చైనా బోర్డర్ లోని సైనిక దళాలలతో మోడీ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే మరుసటి రోజే కేదారినాధ్ ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ 2013లో సంభవించిన వరదల కారణంగా శంకరా చార్యుడి సమాధి పూర్తిగా దెబ్బతినింది. దీన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి ఈరోజు మోడీ శంకుస్థాపన చేశారు. అలాగే వరదల్లో దెబ్బతినకుండా కేదార్ నాధ్ ఆలయం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించనున్నారు. దీనికి కూడా మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాదిలో కేదారి నాధ్ ఆలయాన్ని మోడీ సందర్శించడం ఇది రెండోసారి.
భోలే బాబా ఆశీస్సులు పొందా...
ఈ సందర్భంగా కేదార్ నాథ్ లో నూతనంగా నిర్మించిన కేదార్ పురి టౌన్ షిప్ ను మోడీ ప్రారంభించారు. అనంతరం మోడీ బహిరంగ సభలో ప్రసంగించారు. దీపావళి తర్వాత కేదారీశ్వరుడిని సందర్శించడం ఆనందంగా ఉంద్నారు. 2022 నాటికి భారత్ ను నవభారత్ గా తీర్చిదిద్దుతానని మోడీ ప్రకటించారు. అందుకే కేదారినాధుడి ఆశీస్సులు కోరేందుకే తాను వచ్చానన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు. విపక్షాలు కేవలం విమర్ళలకు చేయడానికే పరిమితమయ్యాయయని, సూచనలు ఇచ్చేందుకు సుముఖంగా లేరని ఆయన దుయ్యబట్టారు.
- Tags
- మోడీ

