Sat Apr 11 2026 11:26:53 GMT+0530 (India Standard Time)
కేటీఆర్ ట్వీటు అదిరి...పోలా..?

తెలంగాణ మంత్రి కేటీఆర్ నిత్యం ట్విట్టర్లో అందుబాటులో ఉంటారు. అనేక సమస్యలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా కులకర్ణి అనే వ్యక్తి తన ఇల్లును ఎవరో ఆక్రమించారని, అద్దె కూడా ఇవ్వడం లేదని, ఖాళీ చేయమంటే చేయడం లేదని, అదేమంటే తమకు కేటీఆర్ అండ ఉందంటున్నారని కులకర్ణి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. అయితే దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు. కులకర్ణి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో తాను ఇళ్లను ఆక్రమించుకునే వారికి అండగా ఉండనని కులకర్ణికి బదులిచ్చారు. కేటీఆర్ ట్వీట్ అదిరింది కదూ...!
- Tags
- కేటీఆర్
Next Story

