కేటీఆర్....ఇవాంకా.... ఒకే వేదికపై

ఒకే వేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్, ట్రంప్ కుమార్తె ఇవాంకా పాల్గొన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల రెండో రోజు సదస్సులో కేటీఆర్ సమన్వయ కర్త గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇవాంకా ట్రంప్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్, బ్రిటన్ మాజీ ప్రధాని సతీమణి చెర్రీ బ్లెయిర్ పాల్గొన్నారు. పారిశ్రమికవేత్తలుగా మహిళలు రాణిస్తున్నారన్నదానిపై చర్చ జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, మహిళలకు స్కిల్ డెవలెప్ మెంట్ లో శిక్షణ ఇవ్వడం స్ఫూర్తి దాయకమని ఇవాంకా అభిప్రాయపడ్డారు. విభిన్న రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. మహిళలు అందిపుచ్చుకోవాలన్నారు. కొత్త ఆవిష్కరణలన్నీ ప్రయివేటు సంస్థల నుంచే వస్తున్నాయన్నారు. మహిళల కోసం ప్రత్యేక విధానాలేమీ లేవని చందాకొచ్చర్ అభిప్రాయపడ్డారు. కేటీఆర్ సమన్వయ కర్తగా అధ్భుతంగా రాణించారని నెటిజన్ల నుంచి ప్రశంసలందుతున్నాయి.
- Tags
- కేటీఆర్ ఇవాంకా

