కేంద్రంపై చంద్రబాబు సీరియస్

కేంద్రప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ అవిశ్వాసం పై నోటీసులు ఇచ్చినా ఎందుకు చర్చ చేపట్టరని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ఉదయం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఇతర పార్టీల చేత కూడా అవిశ్వాస నోటీసులు ఇప్పించాలని కోరారు. అవిశ్వాసంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయినా వెనుకంజ వేయొద్దని పార్లమెంటు లోపల, బయట ఆందోళనలకు దిగాలని ఆయన ఎంపీలకు సూచించారు. పోడియం వద్దకు వెళ్లకుండా తమ స్థానాల్లోనే నిలబడి నిరసన వ్యక్తం చేయాలని, అవిశ్వాసం చర్చకు వచ్చేలా సహకరించాలని ఆందోళన చేస్తున్న ఇతర పార్టీల ఎంపీలకు విజ్ఞప్తి చేయాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు.
- Tags
- చంద్రబాబు
