Sat Apr 04 2026 12:30:59 GMT+0530 (India Standard Time)
కేంద్రంతో విసుగెత్తిన చంద్రబాబు... సంచలన నిర్ణయం?

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2014 ఏపీ పోలీస్ యాక్ట్ ను సవరించి 2017 యాక్ట్ కు ఆర్డినెస్స్ జారీ చేసింది. డీజీపీని నియమించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే మూడుసార్లు డీజీపీ సాంబశివరావు పేరును పంపినా వెనక్కు పంపింది. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పనిలేకుండా ఏపీ పోలీస్ యాక్ట్ ను సవరించి కొత్త చట్టాన్ని మంత్రివర్గం ఆమోందించింది. దీంతో కేంద్రంతో సంబంధం లేకుండా డీజీపీని ప్రభుత్వమేనియమించుకునే అవకాశముంది. డీజీపీ నియామకంపై ఇప్పటికీ యూపీఎస్సీ మూడు సార్లు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను వెనక్కు పంపడంతో విస్తుపోయిన చంద్రబాబు ఈనిర్ణయం తీసుకున్నారు.
- Tags
- చంద్రబాబు
Next Story

