Sun Apr 05 2026 18:23:26 GMT+0530 (India Standard Time)
కెమెడియన్ సూసైడ్ లో కొత్త ట్విస్ట్

హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు విజయ్ సెల్ఫీ వీడియో రికార్డుచేసినట్లు పోలీసులు కనుగొన్నారు. తన భార్యపై విజయ్ ఆరోపణలు చేశారు. భార్య వనితతో పాటు న్యాయవాదులు, శశిధర్ అనే పారిశ్రామిక వేత్త తనను వేధించారని అందువల్లనేతాను ఆత్మహత్య చేసుకున్నానని విజయ్ ఆరోపించారు. తనకు వివాహేతర సంబంధాలున్నాయని, ఆ వీడియోలు తమ వద్ద ఉన్నాయని శశిధర్ బెదిరించారని విజయ్ ఆరోపించారు. అయితే విజయ్ భార్య వనిత మాత్రం విజయ్ తనను వేధించేవాడని, మరో మహిళతో సంబంధం పెట్టుకున్నందుకే తాను విడాకులు కోరినట్లు ఆమె తెలిపారు. సినిమాల్లో అవకాశాలు లేక కాదని, కేవలం కుటుంబ తగాదాల వల్లనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
- Tags
- విజయ్
Next Story

