Thu Feb 05 2026 06:43:21 GMT+0000 (Coordinated Universal Time)
కామినేనికి ఢిల్లీ నుంచి ఫోన్ రాజీనామాకు

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు ఢిల్లీ పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం సందర్భంగా బీజేపీతో పొత్తు ఉపసంహరించుకుంటామని చెబితే వెంటనే రాజీనామా చేయాలని ఆయనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఏపీ శాసనసభలో ఉత్కంఠ నెలకొంది. కామినేనికి ఫోన్ వచ్చిన వెంటనే అమరావతిలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. చంద్రబాబు పొత్తు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే ఏపీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి చెందిన మంత్రులిద్దరూ రాజీనామా చేయాలని ఆదేశాలు అందాయి. ఈ విషయంపై ఢిల్లీలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో మాట్లాడి ఖరారు చేసుకున్నారు. స్పీకర్ వద్ద సమయం తీసుకుని రాజీనామాలు సమర్పించాలని హరిబాబు చెప్పినట్లు తెలిసింది.
- Tags
- కామినేనికి ఫోన్
Next Story
