కలెక్టర్ కావాలిసినోడు కటకటాలు లెక్కించాడు ...!

సమాజంలో మానసిక రుగ్మతల తీవ్రత మనుషుల్లో నానాటికి పెరిగిపోవడం ఆందోళనకలిగించే అంశం. చిన్న చిన్న విషయాలకు హత్యలు, ఆత్మహత్యలు, కిడ్నాప్ లు రొటీన్ అయిపోతున్నాయి. తాజాగా ఢిల్లీ లో జరిగిన ఒక బాలుడి కిడ్నాప్ ఆ తరువాత హత్య గురైన సంఘటన సభ్య సమాజాన్ని నివ్వెర పరిచేలా వుంది. హైదరాబాద్ లో ఒక మహిళను తనతో సన్నిహితంగా వుండే వ్యక్తితో క్లోజ్ గా వున్న పాపానికి ఇటీవలే ఒక మహిళను ముక్కలుగా నరికి బస్తాలో వేసి పార్క్ దగ్గర తల్లి కొడుకు వదిలి వెళ్ళిన మిస్టరీని పోలీసులు ఛేదించారో లేదో ఢిల్లీ లో మరోఘోరం వెలుగు చూసింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే ...
బాలుడితో మాట్లాడవద్దని మందలించినందుకు...
యూపీకి చెందిన అవదేశ్ ఢిల్లీ లోని స్వరూప్ నగర్ ప్రాంతంలో అద్దెకుంటూ సివిల్స్ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాడు. మూడు సార్లు సివిల్స్ లో ప్రిలిమ్స్ రెండుసార్లు మెయిన్స్ రాసిన అవదేశ్ కలెక్టర్ కావడమే లక్ష్యంగా చదివేవాడు. అతడు నివాసం ఉంటున్న ఇంటి యజమానితో వచ్చిన విభేదాల కారణంగా కొద్ది కాలం క్రితం వేరే ఇంటికి అద్దెకు వెళ్ళిపోయాడు. పాత ఇంటి యజమాని కి వున్న ఏడేళ్ల బాలుడు అనీష్ ను అవదేశ్ తో మాట్లాడవద్దని తండ్రి కరణ్ సింగ్ మందలించాడు. ఆ విషయం తెలుసుకుని కరణ్ సింగ్ పై కక్ష పెంచుకున్న అవదేశ్ అనీష్ ను సైకిల్ కొనిపెడతా అంటూ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి తన ఇంట్లో దాచాడు. అవనీష్ కిడ్నాప్ తో కరణ్ దగ్గర లక్షల్లో డబ్బు గుంజాలని అనుకున్నాడు. కుమారుడు కనపడక పోవడంతో కరణ్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక తాను ఎవరో అనీష్ కు తెలుసు కనుక దొరికిపోతా అన్న ఆందోళనతో అవదేశ్ బాలుడిని కిరాతకంగా చంపి ముక్కలు చేసి సూట్ కేస్ లో పెట్టి తన మంచం కిందే ఉంచాడు.
పోలీసులకు సవాల్ గా మారిన కేసు ...
హత్య చేసిన తరువాత బాలుడి తండ్రి కరణ్ తో పాటు అనీష్ కోసం గాలించడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు అవదేశ్. ఐదు వారాలు గడిచాయి కేస్ మిస్టరీ ఛేదించలేకపోయిన పోలీసులకు అతడు చేసిన తప్పే పట్టించింది. సూట్ కేసు నుంచి భరించలేనంత దుర్వాసన రావడంతో చుట్టూ పక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట ఎలక చచ్చింది అని డ్రామా ఆడినా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేస్తే అవదేశ్ దుర్మార్గం బయటపడింది. దాంతో అవదేశ్ కు అరదండాలు వేసి కటకటాల వెనక్కి తోశారు ఖాకీలు.

