కర్నూలు టీడీపీలో టీజీ కొత్త ట్విస్ట్...!

కర్నూలు జిల్లా రాజకీయం ఎన్నికలకు ముందే వేడెక్కింది. కర్నూలులో ముఖ్యంగా భూమా కుటుంబం, కేఈ కుటుంబాలదే ఆధిపత్యం. కర్నూలు జిల్లాలో పట్టున్న ఈ కుటుంబాల్లో ప్రస్తుతం భూమా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి హఠాన్మరణంతో వారికి పెద్దదిక్కుగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహరెడ్డి అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అన్ని విధాలుగా బలంగా ఉన్న నేత టీజీ వెంకటేశ్ ఇప్పుడు భూమా కుటుంబానికి తలనొప్పిగా మారారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ను తన కుమారుడు భరత్ కు ఇప్పించుకోవాలని టీజీ పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు.
ఒకే కుటుంబానికి మూడు సీట్లా?
ఇందుకోసం సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురికి టిక్కెట్లు ఎలా ఇస్తారన్న ప్రశ్న టీజీ బహిరంగంగా వేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 12 రోజుల పాటు జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఇదే చర్చరచ్చగా మారింది. కర్నూలు టౌన్ లో టీజీ వెంకటేశ్ కు కూడా పట్టుంది. ఆయన పారిశ్రామికవేత్తగానే కాకుండా గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్న టీజీ ఈసారి ఎలాగైనా కుమారుడిని రంగంలోకి దించాలనుకుంటున్నారు.
భూమా ఫ్యామిలీ టార్గెట్ గా...
భూమా కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి (భూమా నాగిరెడ్డి బావమరిది) ఉన్నారు. ఈ పాయింట్ ను టీజీ జన్మభూమి కార్యక్రమంలో హైలెట్ చేస్తూ వస్తున్నారు. జన్మభూమి ముగింపు సభ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీజీపై పరోక్షంగా విమర్శలు చేశారు. తాను కర్నూలును వీడి వెళ్లే ప్రసక్తిలేదన్నారు. పత్తికొండ సీటు తాను అడిగితే కేఈ కుటుంబం తనను తుంగభద్రలో కలిపేస్తారని, ఆళ్లగడ్డ సీటు అడిగితే కుటుంబ సభ్యులే తనను ఇంట్లోకి రానివ్వవరని అన్నారు. అందుకే తాను కర్నూలు నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. అదే సభలో ఉన్న టీజీ వెంకటేశ్ దీనికి కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. ఒకేకుటుంబానికి మూడు సీట్లు ఎలా ఇస్తారని, ఒక సీటు ఇవ్వకపోయినా పరవలేదని ఆయన అనడంతో అక్కడ కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అయితే టీజీ వెంకటేశ్ కూడా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేఈ కుటుంబంలో కూడా వచ్చే ఎన్నికల్లో ఇద్దరు టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో కర్నూలు సీటు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఇవ్వాలన్న టెన్షన్ ఇప్పటి నుంచే టీడీపీ అధిష్టానానికి మొదలయింది.
క

