కమలం వికసించకపోవడానికి కారణాలివేనా?

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ హైకమాండ్ నివేదిక కోరింది. ఈ మేరకు పార్టీ అగ్రనేత రాంలాల్ ఈమేరకు మూడు రోజుల పాటు బీజేపీ కార్యాలయంలోనే మకాం వేశారు. బీజేపీ అనుబంధ సంఘాల నేతలందరితోనూ చర్చించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి వారి నుంచి అవసరమైన సూచనలను తీసుకున్నారు. మూడురోజుల పాటు రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షలు జరిపారు. అయితే రాంలాల్ సమీక్షలో బీజేపీలోని అనేక లోటుపాట్లు బయటపడ్డాయి. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేస్తామంటే రాష్ట్ర నేతలకు కొందరు వెనక్కు లాగుతున్నారని కొందరు రాంలాల్ ఎదుటే ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు కలిసి కట్టుగా పనిచేయడం లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు. ముఖ్యంగా బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేసేదిశగా ప్రయత్నాలే చేయడం లేదని చెప్పారు.
అమిత్ షాకు పూర్తి స్థాయి నివేదిక........
అయితే అమిత్ షా వ్యూహాన్ని ఇంతవరకూ అమలు పర్చకపోవడంపై కూడా ఆయన మండిపడినట్లు తెలిసింది. బూత్ లెవెల్ కమిటీలను పూర్తిగానియమించక పోవడం, బూత్ కన్వీనర్లను నియమించి వారిని క్షేత్రస్థాయికి పంపకపోవడంపైన కూడా రాంలాల్ తప్పుపట్టినట్లు తెలిసింది. బీజేపీలోని రాష్ట్ర స్థాయి నేతల్లోనూ సమన్వయం కొరవడిందని రాంలాల్ అభిప్రాయపడినట్లు తెలిసింది. లక్ష్మణ్ నాయకత్వంలో పనిచేసేందుకు కొందరు విముఖతగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. దీంతో కోర్ కమిటీలో రాష్ట్ర నేతలను సుతిమెత్తంగా హెచ్చరించారు. ఇలానే విభేదాలుకొనసాగితే పార్టీకంటే నేతలకే ఎక్కువ నష్టం జరుగుతుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడి గ్రూపు విభేదాలపై పార్టీ హైకమాండ్ కు రాంలాల్ నివేదిక ఇవ్వనున్నారు. అమిత్ షా చెప్పినట్లు ఇక్కడ పార్టీ నడవడం లేదని ఆయన గుర్తించి నివేదిక రూపొందించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర పార్టీ నేతలు హైరానా పడతున్నారు.
- Tags
- బీజేపీ

