Sat Mar 28 2026 20:20:26 GMT+0530 (India Standard Time)
కనుసైగల ప్రియకు ఊరట....!

ప్రియా వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల తన కనుసైగలతో అంతర్జాలంలో అలజడి సృష్టించిన హీరోయిన్ ప్రియా వారియర్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే వీటిపై ప్రియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై వివిధ రాష్ట్రాల్లో ఉన్న కేసులను తొలగించాలని ప్రియా వారియర్ కోరారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రియా విధించిన కేసులపై స్టే విధించింది. పాట తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ప్రియా వారియర్, ఆ సినిమా దర్శకుడిపై కొందరు ఫిర్యాదుచేశారు. దీంతో ప్రియా వారియర్ సుప్రీంకోర్టు ఆశ్రయించగా, ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
- Tags
- ప్రియా వారియర్
Next Story

