Mon Apr 06 2026 16:55:41 GMT+0530 (India Standard Time)
ఓయూలో సంచలనం...! విషాదం..!

రేపు నిరుద్యోగుల సమస్య మీద కొలువుల కొట్లాట సభ ఉన్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం కల్గించింది. ఓయూ మానేరు హాస్టల్ లో ఉండే మెదక్ జిల్లాకు చెందిన మురళి ఎమ్మెస్సీ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. ఓయూలోని మానేరు హాస్టల్ లోని రూం నెంబరు 159లో మురళి ఉంటున్నాడు. అయితే బాత్రూంలోని కొక్కేనికి షూ లేస్ తో మురళి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు ఉస్మానియాకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిరుద్యోగాన్ని భరించలేకనే మురళి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు ఆందోళనకు దిగుతారని భావించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఓయూలో పోలీసు బందోబస్తు భారగీ ఏర్పాటు చేశారు.
Next Story

