ఐదుగురు ఎమ్మెల్యేలు మిస్సయ్యారా?

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. నిన్న జరిగిన కౌంటింగ్ లో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 38, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలిచారు. ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దానిపై గవర్నర్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ముందుగా ఎవరిని ఆహ్వానించాలన్న దానిపై గవర్నర్ న్యాయనిపుణుడు హరీశ్ సాల్వేతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలతో సమావేశాలు.....
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ ఎల్పీ నేతను మరికాసేపట్లో ఎన్నుకోనున్నారు. ఢిల్లీ నుంచి ప్రకాశ్ జవదేకర్, నడ్డాలు ఇప్పటకే కర్ణాటక చేరుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ లు కూడా శానససభ పక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. బీజేపీ శాసనసభ పక్షం సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరూ పరేడ్ గా రాజ్ భవన్ కు వెళ్లాలని నిర్ణయించారు. తమనే తొలుత ఆహ్వానించాలని బీజేపీ గవర్నర్ ను కోరనుంది.
రాత్రి నుంచి కన్పించక......
ఇదిలా ఉంటే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి నుంచి కన్పించక పోవడంతో ఆ పార్టీలో ఆందోళన అధికమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన లింగాయత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ నేత యడ్యూరప్ప టచ్ లోకి వెళ్లారన్న వార్తలు కాంగ్రెస్ ను కలవరపరుస్తున్నాయి. వారి కోసం ఇప్పటికే కాంగ్రెస్ నేతలు వెతుకులాట ప్రారంభించారు. మొత్తం మీద బీజేపీ ఎలాంటి షాకిస్తోందన్న టెన్షన్ ఇటు కాంగ్రెస్ లోనూ, అటు జేడీఎస్ లోనూ కన్పిస్తోంది.
- Tags
- amith shah
- bangalor
- bharathiya janatha party
- devegouda
- governor
- indian national congress
- janathadal s
- karnataka
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- గవర్నర్
- జనతాదళ్
- తెలుగు పోస్ట్ ప్రత్యేకం అని ఇమేజ్ చేసి పంపండి karnataka assembly elections
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- నోట్ ఆకుల సత్యనారాయణ ఫొటో
- బీజేపీ లోగో
- బెంగుళూరు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
