ఐటీ నజర్ : బాహుబలి మీద దాడి మొదలెట్టారు

పెద్ద నోట్ల రద్దు తరువాత తొలిసారిగా ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు దృష్టి సారించారు. ముందుగా సినిమా పరిశ్రమ మీదనే తమ దృష్టి కేంద్రీకరించారు. బాహుబలి సినిమా నిర్మాతల ఇళ్ల మీద శుక్రవారం మధ్యాహ్నం ఐటీ దాడులు జరిగాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి ఐటీ దాడులుగా జనం వీటి గురించి చర్చించుకుంటున్నారు.
పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో నల్ల కుబేరులు సొమ్ములు వైట్ మనీ కింద మార్చుకోవడానికి నానా పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ కు చెందిన పలువురు నల్ల డబ్బు విషయంలో ఏమి చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నట్లు పుకార్లు వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ లోని ఒక హీరో ఇంట్లో కూడా సుమారు 25 కోట్ల వరకు లెక్కల్లో లేని సొమ్ము ఉన్నట్లుగా కూడా పుకార్లు వచ్చాయి. ఎటూ డబ్బు మార్పిడికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నడుస్తూనే ఉన్నది గనుక, ఇంత తక్కువ వ్యవధిలో ఐటీ దాడులు ఉంటాయని ఎవరూ ఊహించలేదు.
అయితే తొలిదెబ్బ టాలీవుడ్ మీదనే పడింది. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్ల మీద ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎంతవరకు ఎలాంటి సొమ్ములు పట్టుకున్నారో వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.
టాలీవుడ్ కు షాక్

