Fri Apr 10 2026 11:32:49 GMT+0530 (India Standard Time)
ఏపీ మంత్రులపై జేసీ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మంత్రులపై పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులు వెన్నుముక లేని వాళ్లుగా ఆయన పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో చిట్ చాట్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి మంత్రుల పెత్తనమంతా తమ హయాంలోనే ముగిసిపోయిందన్నారు. ఇప్పుడు మంత్రులంతా టైంపాస్ చేసే వాళ్లేనని, వారు స్వేచ్ఛగా నిర్లయాలు తీసుకోలేరని చెప్పారు. వారికి వెన్నుముక లేదని చెప్పారు. అలాగే జగన్ పాదయాత్రపై కూడా ఆయన కామెంట్స్ చేశారు. జగన్ కు పాదయాత్ర అనవసరమని, ఇప్పుడున్న మీడియా ప్రతి చోటా జరిగే అంశాలను చూపిస్తుంటే, ఈయన పాదయాత్ర చేసి కొత్తగా తెలుసుకునేది ఏందని ప్రశ్నించారు. జగన్ ఒక తిక్కలోడు అని జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Next Story

