Fri Apr 03 2026 02:05:06 GMT+0530 (India Standard Time)
ఏపీకి కొత్త బాస్ ఈయనే...!

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీనండూరి సాంబశివరావు రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఈయన స్థానంలోకొత్త డీజీపీగా మాలకొండయ్యను నియమించారు. కొద్దిసేపటి క్రితం ప్రస్తుత డీజీపీ సాంబశివరావు, మాలకొండయ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. మాలకొండయ్యది ప్రకాశం జిల్లా. 1985 బ్యాచ్ కు చెందిన మాలకొండయ్య ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు. డీజీపీ సాంబశివరావు తన సర్వీసు పొడగింపుకు అంగీకరించకపోవడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం మాలకొండయ్యను నియమించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. కాగా సాంబశివరావుకు ఆర్టీఐ కమిషనర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Tags
- ఏపీ డీజీపీ
Next Story

