Thu Mar 26 2026 21:45:19 GMT+0530 (India Standard Time)
ఏడో రోజూ లోక్ సభ అంతేనా?

ఏడో రోజుకూడా లోక్ సభలో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీడీపీ, వైసీపీ పార్లమెంటు సభ్యులు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన హామీలను అమలుపర్చాలంటూ నినదించారు.టీఆర్ఎస్ సభ్యులు రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక కావేరి జలాలపై ఇతర పార్టీలు కూడా ఆందోళన చేయడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. గత ఏడు రోజుల నుంచి పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.
- Tags
- లోక్ సభ
Next Story

