ఎమెస్కే ముద్రతో తొలిసారిగా క్రికెట్ జట్టు ఎంపిక

ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న న్యూజీలాండ్ జట్టుతో వన్ డే సిరీస్ కు భారత తుది జట్టును ఇవాళ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తెలుగు వాడైన ఎమెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ చీఫ్ అయిన తర్వాత.. మొదటిసారిగా జట్టును ఇదే ఎంపికచేయడం. కీలకమైన బౌలర్లకు విశ్రాంతి ఇచ్చి.. కుర్రాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించే దిశగా.. ఎమెస్కే ప్రసాద్ తనదైన ముద్ర కనిపించేలా జట్టును ఎంపిక చేయడం విశేషం.
వన్డే సిరీస్ కు ఎంపికైన తుది జట్టులో.. ధోనీ, కోహ్లి, రైనా, పాండే, రోహిత్, హార్దిక్ పాండ్యా, రహానే, ధవల్ కుల్ కర్ని, ఉమేష్ కుమార్, అక్షర్, జాదవ్, మన్ దీప్, కేదార్, జయంత్ యాదవ్, బూమ్రా, అక్షర్ పటేల్, లు ఉన్నారు. మన తురుపుముక్క బౌలర్లు రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ లకు విశ్రాంతి ఇస్తున్నట్లుగా సెలక్టర్లు ప్రకటించారు.
ప్రస్తుతం టెస్టు ఫార్మాట్ లో ఉన్న భారత్ జట్టు అద్భుతమైన ఫాంలో ఉండి, మంచి రికార్డు విజయాలను నమోదు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త యువరక్తం కాంబినేషన్ తో వన్ డే జట్టును ప్రయోగాత్మకంగా ఎంపిక చేయడం విశేషం. భారత జట్టులో తమ తమ స్థానాల్ని సుస్థిరం చేసుకోవడానికి తొలిసారిగా అవకాశం పొందిన వారు.. శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

