Wed Mar 25 2026 16:18:49 GMT+0530 (India Standard Time)
ఎంపీలతో జగన్ భేటీ...రాజీనామాలపై?

వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. పార్లమెంటులో అవిశ్వాసంపై అనుసరించాల్సిన వ్యూహం, రాజీనామాల విషయంపై జగన్ ఎంపీలతో చర్చిస్తున్నారు. గుంటూరు జిల్లా చాగంటి వారిపాలెంలో జగన్ బస వద్ద ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటులో అవిశ్వాసం పై చర్చ జరుగుతుందని ఆశతో ఉన్నామన్నారు. కాంగ్రెస్ కూడా అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో బలం పెరిగిందన్నారు. సభను నిరవధిక వాయిదా వేసుకుని వెళితే తాము రాజీనామాలు చేస్తామని మేకపాటి చెప్పారు. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళతామని, ఈసారి 20 మంది ఎంపీలు తమకు ఇవ్వాలని ప్రజలనే కోరతామని మేకపాటి చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించారు.
Next Story

