ఉగ్రవాదికి ఎదురుదెబ్బ ఎలాగంటే?

హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుమారుడు షాహిద్ యూసఫ్ ను నేషనల్ ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాది సలావుద్దీన్ కుమారుడు యూసఫ్ జమ్మూకాశ్మీర్ లోని వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాడు. యూసఫ్ కు హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ నుంచి పెద్దయెత్తున నిధులు అందాయన్నది ప్రధాన ఆరోపణ. 2011లో అందిన ఈ నిధులను యూసఫ్ కాశ్మీర్ లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పకడ్బందీగా ఆధారాలను సేకరించిన అధికారులు యూసఫ్ కు నోటీసులు ఇచ్చి మరీ ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ ను ప్రకటించారు.
నిధులు వస్తున్నాయని....
హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈయన కొడుకు యూసఫ్ జమ్మూ కాశ్మీర్ లోనే ఉంటూ ప్రభుత్వోద్యోగం చేసుకుంటున్నాడు. యూసఫ్ ద్వారా కాశ్మీర్ లోయలో అలజడి సృష్టించేందుకు సౌదీ అరేబియా హిజ్బుల్ మహాహిద్దీన్ సభ్యుడు అహ్మద్ భట్ నుంచి పెద్ద యెత్తున డబ్బు అందింది. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు సిరియా నుంచి యూసఫ్ కు డబ్బు పెద్దయెత్తున అందినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలావుద్దీన్ కు ఊహించని షాక్ తగిలిందనే చెప్పాచ్చు. అయితే జమ్మూ కాశ్మీర్ లోని శాంతిభద్రతలపై చర్చలను ప్రారంభించేందుకు ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసిన మరుసటి రోజే యూసఫ్ ను అరెస్ట్ చేయడం విశేషం.
- Tags
- సలావుద్దీన్

