ఈ పని చేస్తే జగన్ టిక్కెట్ ఇచ్చేస్తారా?

సినిమా తీస్తే సీటు గ్యారంటీయా? అవును... ఇప్పుడు రాకేష్ రెడ్డి విషయంలో అదే టాక్ విన్పిస్తోంది. రాకేష్ రెడ్డి గతంలో ఈ పేరు ఎవరికీ తెలియదు.... రాష్ట్రంలోనే కాదు వైసీపీ పార్టీలోనే నేతలూ ఈ పేరు వినలేదు. అయతే గత పక్షం రోజులుగా రాంగోపాల్ వర్మ లక్ష్మీస్... ఎన్టీఆర్ సినిమా తీస్తున్నానని ప్రకటించిన దగ్గర నుంచి ఈ పేరు పాపులర్ అయింది. ఈ సినిమాకు రాకేష్ రెడ్డి నిర్మాత అని... వైసీపీ లీడర్ అని కథనాలు వచ్చాయి. అప్పటి వరకూ రాకేష్ రెడ్డి అంటే ఎవరో కూడా తెలియని వైసీపీ నేతలు కూడా ఈయన ఎవరు? అని ఆరా తీశారట. ఇంతకీ ఈ రాకేష్ రెడ్డి ఎవరంటే... వైసీపీ సానుభూతిపరుడు. బెంగళూరులో రియల్ వ్యాపారంతో బాగానే సంపాదించాడు. కొన్ని సినిమాలకు ఫైనాన్షియర్ గా కూడా పనిచేశాడు. అయితే రాకేష్ రెడ్డి సొంత ఊడు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఉంది. అయితే రాకేష్ రెడ్డి పలమనేరు నియోజకవర్గంపై కన్నేశారు. నిన్న మొన్నటి దాకా పలమనేరుకు ఎమ్మెల్యేగా అమర్ నాధ్ రెడ్డి ఉండేవారు. అమర్ నాధ్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి చేరి మంత్రి అయి కూర్చున్నారు. దీంతో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో వైసీపీకి సరైన నేత కరువయ్యాడు.
జగన్ దృష్టిలో పడేందుకే.....
ఈ నేపథ్యంలోనే రాకేష్ రెడ్డి కన్ను పలమనేరు నియోజకవర్గంపై పడింది. అమర్ నాధ్ రెడ్డి పార్టీని వీడి వెళ్లిన తర్వాత ఆ నియోజకవర్గ బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు. అక్కడి ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహించాలని జగన్ చేసిన సూచన మేరకు రామచంద్రారెడ్డి ద్వితీయ శ్రేణి నాయకత్వం కోసం చూస్తున్నారు. ఇందులో భాగంగా వెంకాగౌడ్, ఆకుల గజేంద్రలు పోటీ పడుతున్నారు. అయితే వీరు బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో పలమనేరు నియోజకవర్గంపై రాకేష్ రెడ్డి మనసు పారేసుకున్నారు. దీంతో చక..చక..రంగంలోకి దిగారు. వైసీపీ అధినేత జగన్ దృష్టిలో నేరుగా పడాలంటే సినిమా ఒక్కటే మార్గమని భావించారు. అందులోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీస్తే టిక్కెట్ ఖామయనుకున్నారు రాకేష్ రెడ్డి. ఈలోగా రాంగోపాల్ వర్మ తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించడంతో వెంటనే వర్మతో కనెక్ట్ అయ్యారు వర్మ. తాను నిర్మాతగా ఉంటానని చెప్పారు. ఇటీవల వర్మను తీసుకుని పలమనేరు వెళ్లి అక్కడ హడావిడి చేశారు రాకేష్ రెడ్డి. మరి సినిమా తీస్తే... టిక్కెట్ దొరుకుతుందా? రాకేష్ రెడ్డికి పలమనేరు టిక్కెట్ జగన్ ఇస్తారా? చూడాలి మరి.
- Tags
- రాకేష్ రెడ్డి

