ఈ నేత వైసీపీ కోవర్టా...?

టిడిపి తీర్ధం పుచ్చుకున్న గిడ్డి ఈశ్వరి వైసిపి కోవర్టా ? ఇప్పుడు ఈ చర్చ సోషల్ మీడియా లో నడుస్తుంది. వైసిపి నుంచి టిడిపి లోకి జంప్ అయిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్యెల్యే గిడ్డి ఈశ్వరి వాస్తవంగా జగన్ భక్తురాలు. కానీ ఆమె పార్టీ మారడానికి పెద్దగా రీజన్స్ ఏమి లేవు. తన నియోజకవర్గంలో మరో ఇన్ ఛార్జ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారన్న మాట తప్ప మరేమి కారణాలు పేర్కొనలేదు. అందరిలాగే అభివృద్ధి కోసం అనే మాట ఆమె కామన్ గా చెప్పుకొచ్చారు. మిగిలిన పార్టీ మారిన ఎమ్యెల్యేల మాదిరి పెద్ద స్థాయిలో బాబు భజన చేయలేదు సరికదా వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం అంటూ ప్రకటించారు కూడా. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
గోడ దూకిన వారంతా తిట్టి పోయిన వాళ్ళే ...
పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్యెల్యేలు అందరు జగన్ ఒక సైకో అని ఆయన టార్చర్ భరించలేక పోతున్నామని వైసిపి మునిగిపోయే పడవంటూ ఇలా రకరకాల వ్యాఖ్యలు చేసి వెళ్ళి పోయేవారు. కానీ గిడ్డి ఈశ్వరి మాత్రం తన మాజీ బాస్ ను ఒక పక్క పొగడటాన్ని టిడిపి శ్రేణులు సైతం జీర్ణించుకోలేక పోతున్నాయి . ఆమెను ఎంతో కష్టపడి పసుపు కండువా కప్పుకునేలా చేయడంలో తెరవెనుక పాత్ర పోషించిన ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి జవహర్ సైతం ఈశ్వరి వ్యాఖ్యల పట్ల అవాక్కయ్యారంటున్నారు. మరి ఇలాంటి వైఖరితో ఆమె టిడిపి లో కొనసాగుతారా ? లేక వచ్చే ఎన్నికల ముందు వరకు టిడిపిలో కోవర్ట్ గా కొనసాగి తిరిగి సొంత గూటికి చేరుకుంటారా అన్న చర్చ సర్వత్రా కొనసాగుతుంది.
- Tags
- వైసీపీ

