ఈ ఖరీదైన కార్లు పోలీస్ స్టేషన్లో పడి ఎందుకున్నాయ్?

అవును మీరు చదువుతున్నది నిజమే.. 2018కి గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ హైదరాబాద్ సిటీ జనం ఫుల్ ఎంజాయ్ చేశారు. జోష్ లో కేరింతలు కొట్టారు. ఒక్క విషయం మాత్రం మర్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది అని ముందేచెప్పిన పోలీసులు.. అనుకున్నట్లుగానే 100 టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎప్పటికిలాగే రొటీన్ గా భావించి.. న్యూఇయర్ కదా లైట్ తీసుకుంటారని భావించి కిక్ లో వెహికల్ తో రోడ్డెక్కిన సిటీ జనం ఇప్పుడు పరేషాన్ లో పడ్డారు. మొత్తంగా 1500 మంది న్యూఇయర్ వచ్చిన గంటలోనే పట్టుబడ్డారు. గత సంవత్సరాలతో పోల్చితే ఇది చాలా చాలా ఎక్కువ. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలోనే వేయి మంది వరకు పట్టుబడినట్లు సమాచారం.
కార్లన్నీ పోలీస్ స్టేషన్లలో...
పట్టుబడిన వారిలో కార్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 1500లో.. 276 కార్లు ఉన్నాయి. వీటిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఎక్కువ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు పోలీస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. వాహనాల పార్కింగ్ కు ప్లేస్ లేకపోవటంతో రోడ్లపైనే పెట్టారు. వీటిలో అత్యంత ఖరీదు అయిన వెహికల్స్ కూడా ఉన్నాయి. సిటీలోని చాలా పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు ఇదే సీన్. ఎక్కడ చూసినా వాహనాలే. వీటి భద్రత కూడా పోలీసులకు సవాల్ గా మారింది. పట్టుబడిన వాటిలో ఖరీదైనవి ఉన్నవి. అంటే ఎంతో కొంత పలుకుబడిన వారు అయ్యి ఉంటారు. ఆ వాహనాల్లో వస్తువుల భద్రత ముఖ్యం అయిపోయింది. దీంతో కొంత మంది పోలీస్ సిబ్బంది వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆ తర్వాత వాహనాలను అప్పగిస్తారు. మరో రెండు రోజులు ఈ తిప్పలు తప్పవు.

