ఈటల బడ్జెట్ ఇలా

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను పెద్దగా ఆశించకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ మిగులు 5,520 కోట్లు ఉండగా, కేపిటల్ వ్యయం 3,369 కోట్ల రూపాయలుగా ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను 29,041 కోట్లుగా చూపారు. కేంద్ర ప్రభుత్వంనుంచి నిధులు అనుకున్న మేరకు రాకున్నప్పటికీ సంక్షేమ పథకాలు, వివిధ రూపాల్లో ఉన్న ప్రాజెక్టులు ఆగబోవని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా....
వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలకు 15,780 కోట్లు
సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం 25 వేల కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ- 15,563 కోట్లు
కోల్డ్‌స్టోరేజీ, లింకేజీలు -132 కోట్లు
పాలీహౌస్, గ్రీన్ హౌస్ - 120 కోట్లు
ఫౌల్ట్రీ రంగం - 109 కోట్లు
ఆసరా పెన్షన్లకు - 5300 కోట్లు
పౌరసరఫరాలశాఖ - 2946 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి - 9693 కోట్లు
ఎస్సీ అభివృద్ధి శాఖ - 12709 కోట్లు
దళితులకు భూపంపిణీ - 1469 కోట్లు
ఎస్టీల అభివృద్ధి శాఖ - 8063 కోట్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ - 5920 కోట్లు
పంచాయతీల కోసం - 1500 కోట్లు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు - 1000 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమం - 75 కోట్లు
డబుల్ బెడ్రూం ఇళ్లు - 2643 కోట్లు
అమ్మ ఒడి పథకం - 561 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖ - 7375 కోట్లు
చేనేత, టెక్స్టైల్ రంగం - 1200 కోట్లు
రజక ఫెడరేషన్ - 200 కోట్లు
నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ - 250 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్ - 1000 కోట్లు
మైనార్టీ సంక్షేమం - 2వేల కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం - 100 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు - 1450 కోట్లు
ఆరోగ్యలక్ష్మి పథకం - 298 కోట్లు
మహిళాశిశు సంక్షేమం - 1799 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యశాఖ - 1286 కోట్లు
ఐటీశాఖ - 289 కోట్లు
పట్టణాభివృద్ధిశాఖ - 7251 కోట్లు
వరంగల్ నగర అభివృద్ధి - 300 కోట్లు
ఇతర కార్పొరేషన్ల అభివృద్ధి - 400 కోట్లు
సాంస్కృతికశాఖ - 58 కోట్లు
మిషన్ భగీరథ - 1801 కోట్లు
విద్యుత్ శాఖ - 5,650 కోట్లు
రోడ్లు, రవాణా, భవనాలు - 5,575 కోట్లు
ఉన్నత విద్య - 2448 కోట్లు
రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం - 2823 కోట్లు
పాఠశాల విద్య - 10,830 కోట్లు
వేములవాడ దేవాయం అభివృద్ధి - 100 కోట్లు
భద్రాచలం ఆలయ అభివృద్ధి - 100 కోట్లు
సీజీఎఫ్ - 50 కోట్లు
హోంశాఖ - 5790 కోట్లు
అర్చకుల జీతభత్యాలు - 72 కోట్లు
బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధి - 50 కోట్లు
