ఇవాంకా... దెబ్బకు ఈ ఉద్యోగులకు కష్టాలేనా?

ఇవాంకా బస చేసే వెస్ట్రన్ హోటల్ చుట్టుప్రక్కల ఏరియాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి .అక్కడ లక్షల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు . 28 తేదీన ఇవాంకా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు . అక్కడినుంచి రోడ్డు మార్గంలో వెస్ట్రన్ హోటల్‌కు వచ్చి..... అక్కడే రాత్రి బస చేస్తారు . ఆమె ఉన్నన్ని రోజులూ హోటల్ చుట్టుపక్కల ఉన్న కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ఉద్యోగులకు కష్టాలుతప్పేలా లేవు . 27 నుంచి 29 వరకూ కొత్తవాళ్లను ఎవరిని కూడా రహేజా మైండ్ స్పేస్‌లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మూడురోజులు కూడా తమ అపాయింట్మెంట్స్ వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు . మరోవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు అధికారులు సలహాలిస్తున్నారు. ఇప్పటికే ఈ హోటల్ దరిదాపుల్లో ఫెడరల్ అధికారులతో పాటు నిఘా అధికారులు మాటు వేశారు . ఇవాంకా ట్రంప్ రాకతో హైదరాబాద్ అధికారులు పరేషాన్లో మునిగిపోయారు . ఇవాంకా బస చేసే హోటల్స్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ప్రజలకు తిప్పలు తప్పేట్లు లేవు . ఎయిర్ పోర్ట్ లో కూడా కొత్త తరహా ఆంక్షలను అధికారులు విధిస్తున్నారు . ఏడురోజుల్లో ఇవాంకా హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆమె రావడానికి ముందే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్‌నూమా ప్యాలెస్ వరకూ భద్రత కట్టుదిట్టం చేశారు.
మోడీకి మించిన భద్రత.....
మోడీ భద్రత కంటే కూడా ఇవాంకా సెక్యూరిటియే ఎక్కువగా ఉంది . ఆమెకు కల్పించిన సెక్యురిటీ గురించి పూర్తి వివారాలు తెలుసుకుందాం. తెలంగాణా ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వం జాయింట్ గా ఫలక్‌నూమా ప్యాలెస్‌లో ఓ విందును ఏర్పాటు చేశారు . ఈ విందుకు అన్ని దేశాల ప్రతినిధులతో పాటు ప్రధాని మోడీ, ఇవాంకా హాజరు కానున్నారు . ఈ ప్యాలెస్ చుట్టు పక్కల పదుల సంఖ్యలో బస్తీలు , కాలనీలున్నాయి . ఇక్కడ నివసించే ప్రజల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు . కొత్తవారు ఎవరైనాఉంటే వారిని అక్కడినుండి పంపించివేస్తున్నారు . అద్దెకుంటున్నవారి వివరాలతో పాటు సొంత ఇళ్లు ఉన్నవారి వివరాలు తీసుకుంటున్నారు . ప్రతీ ఇంటింటికి తిరిగి గుర్తింపు కార్డులను , పనిచేస్తున్న కంపెనీల పేర్లను పరిశీలిస్తున్నారు . 28 సాయంత్రం ఇవాంక ఫలక్‌నూమా ప్యాలెస్‌ను సందర్శించబోతున్నారు. ఈ రెండు రోజులు ప్రజలెవరూ కూడా ఇష్టమెుచ్చినట్లు వ్యవహరించకూడదని ఆదేశించారు . ఈ ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ కబ్జాలో పెట్టుకున్నారు . ఇవాంకా పర్యటన నేపధ్యంలో భద్రత కట్టుదిట్టం చేశామంటున్నారు పోలీసులు.
- Tags
- ఇవాంకా

