Thu Mar 26 2026 02:25:49 GMT+0530 (India Standard Time)
ఇద్దరు ఎమ్మెల్యేల గన్ మెన్ల ఉపసంహరణ

శాసనసభ్యత్వం రద్దుకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల గన్ మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. శానససభ్యత్వాలు రద్దు కావడంతో వారి గన్ మెన్లను వెనక్కు తీసుకుంది. దీనిపై కోమటిరెడ్డి కేసీఆర్ పై ఫైరయ్యారు. తనను చంపడానికి కుట్ర జరగుతుందన్నారు. సభ్యత్వం రద్దు వ్యవహారం కోర్టులో ఉండగానే గన్ మెన్లను ప్రభుత్వం ఎలా ఉప సంహరించుకుంటుందని ప్రశ్నించారు. కేసీఆర్ బుల్లెట్ కన్నా తన గుండె శక్తిమంతమైనదన్నారు. మిషన్ భగీరధలో అవినీతిని తాను ప్రశ్నించినందుకే కేసీఆర్ తనపై పగబట్టారన్నారు కోమటిరెడ్డి. తాను, కేసీఆర్ శాశ్వతం కాదన్నారు. బొడ్డుపల్లి శ్రీనులా తనను హతమార్చాలని చూస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
Next Story

