Mon Apr 06 2026 02:25:54 GMT+0530 (India Standard Time)
‘ఆ ఎంపీ నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు’

బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు నా ఫోన్ కూడా ఎత్తలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల నర్సాపురం నియోజకవర్గంలో తన పోస్టర్ చించేసిన కేసులో తన అభిమానులను కొందరని అరెస్ట్ చేశారన్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే అరెస్ట్ చేయడంతో తాను ఈ విషయాన్ని మాట్లాడేందుకు ఎంపీ గోకరాజు గంగరాజుకు ఫోన్ చేశానన్నారు. తాను ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తిని కాదని, అన్యాయంగా అరెస్ట్ లు చేయొద్దని చెప్పటానికే ఫోన్ చేస్తే ఆయన కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. తాను అప్పుడు ఒక మనిషిని నర్సాపురం కు పంపాల్సి వచ్చిందన్నారు. తనలాంటి వారి మాటలకే బీజేపీ నేతలు విలువ ఇవ్వరని, ఇక సామాన్యుడి కష్టాలు బీజేపీకి ఎందుకు పడతాయని అన్నారు. ఒంగోలు జనసేన కార్యకర్తల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- Tags
- పవన్ కల్యాణ్
Next Story

