Tue Feb 03 2026 19:14:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఆపరేషన్ ఉత్తుత్తిదేనన్న ఉండవల్లి

సినీ హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ అంతా కట్టుకధేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆపరేషన్ ద్రవిడ, గరుడ, రావణ అంటూ కట్టుకథలను సినిమా స్టయిల్ లోచెప్పారని అన్నారు. అంతంత డబ్బు ఖర్చు చేసి రాజకీయ పార్టీలు పొలిటికల్ ఆపరేషన్లు చేస్తాయని తాను అనుకోవడం లేదని ఉండవల్లి మీడియాతో అన్నారు. శివాజీ చెప్పినవన్నీ సినిమాల్లోనే సాధ్యమన్నారు. బీజేపీ అవిశ్వాసం అంటేనే భయపడిపోతుందన్నారు ఉండవల్లి. సభలో బలం ఉన్నా అవిశ్వాసం పై చర్చించడానికి బీజేపీకి ఎందుకు జంకుతుందని ఆయన ప్రశ్నించారు.
Next Story
