Sat Mar 28 2026 15:28:42 GMT+0530 (India Standard Time)
ఆశలు వదులుకోవాల్సిందేనన్న జేసీ

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రానే రాదన్నారు. ఇక ప్రత్యేక ప్యాకేజీ నిధులు కూడా వచ్చేది కష్టమేనని జేసీ జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తే కొంతమేర నిధులు విడుదలయ్యే అవకాశముందని, అవి కూడా అరకొరేనని ఆయన తెలిపారు. ఇక కేంద్రం ఏదో ఇస్తుందని, చేస్తుందన్న ఆశలు వదులుకోవాల్సిందేనని జేసీ అభిప్రాయపడ్డారు.
Next Story

