ఆమె అడుగుపెడితే సర్వనాశనమా ...?

దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు వాసుల రూటే సపరేట్. జల్లి కట్టు ఉద్యమాలైనా మరేదైనా అక్కడ ప్రజా సంఘాలు పోరాటం సంకల్పించాయంటే ప్రభుత్వాలు గజగజ వణకాలిసిందే. తమ ప్రాంత సమస్యలపై తమిళ , కన్నడ సంఘాలు చేసే ఆందోళనలు చాలా బలంగా ప్రజల్లోకి వెళతాయి. అలా వెళ్ళి జనం చేత ఛీ కొట్టించుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో తెచ్చుకోకుండా సర్కార్లు ముందే కళ్ళు తెరుస్తాయి. తమ నిర్ణయాలు ప్రజా పక్షం గా వుంటాయని చెప్పేందుకు శతధా ప్రయత్నాలు చేస్తాయి. రాష్ట్ర పరిధిలోని అంశం కాకపోతే కేంద్రంతో నేరుగా పోరాటం మొదలు పెడతాయి. తాజాగా ఒక ఇష్యూ కర్ణాటకలో చలికాలంలో వేడి పుట్టించింది.
ప్రభుత్వానికి చెమట పట్టించిన సన్నీ లియోన్ ...
కొత్త ఏడాది బెంగళూరు లో వేడుకలు భారీఎత్తున చేసేందుకు అక్కడ క్లబ్ సన్నాహాలు చేసింది. అంతవరకు ఒకే ఆ కార్యక్రమానికి సన్నీలియోన్ వచ్చి తన అదరగొట్టే ఫెరఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం లీక్ అయ్యింది. వెంటనే కన్నడ సంఘాలు పెద్దయెత్తున రంగంలోకి దిగిపోయాయి. తక్షణం సన్నీ రాకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని అల్టిమేటం ఇచ్చాయి. ఆమె అడుగుపెడితే కన్నడ సంస్కృతి నాశనం అయిపోతుందంటూ ఆందోళన మొదలుపెట్టాయి. వెంటనే కన్నడ సర్కార్ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. నిర్వాహకులను పిలిచి షో రద్దు చేసుకోవాలని కోరింది. వారు ససేమిరా అనడంతో శాతిభద్రతల దృష్ట్యా షో కి అనుమతి నిరాకరించారు. కావాలంటే భారత నాట్యం చేయించండి అని సలహా కూడా ఇచ్చారు సాక్షాత్తూ ఆ రాష్ట్ర హోం శాఖా మంత్రి. ఇప్పిటికే సన్నీకి అడ్వాన్స్ ఇచ్చి బుక్ అయిపోయిన నిర్వాహకులు వెంటనే షాక్ కి గురయ్యి కోర్టు ను ఆశ్రయించాలని భావిస్తున్నారు.
- Tags
- సన్నీ లియోన్

