Thu Mar 26 2026 02:25:48 GMT+0530 (India Standard Time)
ఆగస్టు సంక్షోభాన్ని గుర్తు చేసిన చంద్రబాబు

ఏపీ హక్కుల కోసం చివరకంటా పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఆగస్టు సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు చివరిదాకా పోరాడి విజయం సాధించిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు చంద్రబాబు గుర్తు చేశారు. బీజేపీ తమపై అనుమానం పెంచుకుందని, కేంద్రం మాట నిలబెట్టుకోక పోవడం వల్లనే తాము ఆందోళనకు దిగామన్నారు. ఏపీ సమస్య ఇప్పుడు జాతీయ అంశంగా మారిందన్నారు. జాతీయ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ బీజేపీ విన్పించుకోవడం లేదన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు.
- Tags
- చంద్రబాబు
Next Story

