ఆగని తలాక్ లు

తలాక్ పైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. తలాక్ అని చెపితే కఠిన చర్యలు అంటూ చట్టం తీసుకుని వచ్చింది. వివాహిత ముస్లిం మహిళ రక్షణ కొరకు ఈ చట్టం తీసుకుని వస్తున్నామని కేంద్రం చెప్పింది.అయితే తలాక్ లు ఆగి పోతాయని అందరూ భావించారు. అయితే హైదరబాద్ లో మాత్రం తలాక్ లు ఆగడం లేదు. ఎందుకంటే కేంద్రం తెచ్చిన చట్టాన్ని హైదరాబాద్ వాసులు పట్టించుకోవడం లేదు .. ఎందుకంటే వివాహం అయిన కొన్ని నెలలకే తలాక్ ఇచ్చిన తీరు ఇది.
పోస్టులో తలాక్....
పాతబస్తీలోని రెయిన్ బజార్ కు చెందిన బేగం కు ఖాదిర్ తో వివాహం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదిన వీరి వివాహం జరిగింది. బేగం తండ్రి ఒక్క చిరు వ్యాపారి. తనకు తెలిసిన మరొక చిరు వ్యాపారి కూమారుడికి ఇచ్చి వివాహం చేశాడు ఇక్కడ వరకు బాగానే వుంది. అసలు విషయం ఎంటంటే వివాహం చేసుకున్న ఖాదిర్.. కొన్నాళ్లు పాటు బేగంతో కాపురం చేశాడు. ఒకరోజు పుట్టింటికి పొమ్మని చెప్పాడు. అయితే ఎందుకు అని అడగకుండానే బేగం తన పుట్టింటికి వెళ్లిపొయింది. తనను వచ్చి భర్త తీసుకుని పోతాడని ఎదురు చూస్తుంది. గత నెల రోజుల నుంచి భర్త కోసం ఎదురు చూసింది. తాను ఇంటికి వస్తానని చెప్పింది. అందుకు ఖాదిర్ వద్దు అని చెప్పాడు. తాను వచ్చి తీసుకొని పొతానని తెలిపాడు. సడెన్ గా రెండు రొజుల క్రితం పొస్టులో తలాక్ నామా పత్రాన్ని పంపించాడు ఖాదిర్. తనకు తలాక్ ఎందుకు పంపావని అడిగితే నీవు ఇష్టం లెదని చెప్పి ఫోన్ కట్ చేశాడు. పోస్ట్ లో తలాక్ పంపడంతో అవాక్కైన బేగం వెంటనే రెయిన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ఆరంభించారు. ప్రసుత్తానికి పరారీలో వున్న ఖాదిర్ తో పాటుగా కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
- Tags
- తలాక్
