Sun Mar 29 2026 21:12:57 GMT+0530 (India Standard Time)
ఆఖరిరోజున ఎంపీలకు బాబు ఆదేశం ఇదే....!

ఈరోజు పార్లమెంటు బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఆఖరి రోజు. ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రం నుంచి సానుకూలత రాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆఖరి రోజున పోరాటం ఉధృతం చేయాలన్నారు. నిరసనల వేడిని మరింత పెంచాలని కోరారు. ఉభయ సభల్లో సమావేశాలను అడ్డుకోవాలని సూచించారు. అంతేకాదు సస్పెండ్ అయినా వెనకాడవద్దని ఆయన ఎంపీలను ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ముగిసింది. ఈరోజు ఉదయమే దుబాయ్ నుంచి వచ్చిన చంద్రబాబు ఎంపీలతో మాట్లాడి ఈరోజు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
- Tags
- చంద్రబాబు
Next Story

