అమెరికాలో కాల్పులు...17 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుగు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది మృతి చెందారని తెలుస్తోంది. వీరంతా విద్యార్థులే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో ఉన్న మర్జోరి స్టోన్ మన్ డగ్లస్ పాఠశాలలో నికోలస్ అనే విద్యార్థి చదువుతున్నాడు. ఇతనిని స్కూల్ యాజమాన్యం కొద్ది రోజుల క్రితం సస్పెండ్ చేసింది. తనను సస్పెండ్ చేయడంపై కోపంతో రగిలిపోయిన నికోలస్ స్కూల్ కు వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. నికోలస్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురిని కాల్చేశాడు. ఆ తర్వాత తానే స్కూల్ లో ఉన్న ఫైర్ అలారం మోగించాడు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిందని బావించిన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడే నక్కి ఉన్న నికోలస్ వారిపై దారుణంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే 17 మంది చనిపోగా, 14 మంది గాయాలపాలయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

