Fri Mar 27 2026 19:05:10 GMT+0530 (India Standard Time)
అమిత్ షా ఇంటి వద్ద ఉద్రిక్తత

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీలోని అమిత్ షా నివాసం ఎదుట ఏపీకిచెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. షా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఊహించని పోలీసులు ఒక్క క్షణం తేరుకుని విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈరోజంతా ఏపీలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజాసంఘాల ఆందోళనతో ఢిల్లీ అట్టుడికి పోయింది. ఒకవైపు వైసీపీ ధర్నా కూడా ఉద్రిక్తతకు దారితీయడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు.
- Tags
- అమిత్ షా
Next Story

