అబ్బ... రాజమౌళి సూపర్ అంటున్న చంద్రబాబు...!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి చంద్రబాబు ఫిదా అయిపోయారు. అమరావతి నిర్మాణంలో జక్కన్న సలహాలు, సూచనలు సూపర్ గా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పదిరోజుల తరువాత అమరావతి చేరుకున్న చంద్రబాబు మీడియా తో చిట్ చాట్ లో ఈ అంశాలు వెల్లడించారు. రాజమౌళి సూచనలు తో తెలుగుదనం ఉట్టిపడేలా అమరావతి ఉండబోతుందని ఆనందంగా చెప్పుకొచ్చారు. ఒక్క అసెంబ్లీ భవనం తప్ప అన్ని డిజైన్లు ఫైనల్ అయిపోయాయని అన్నారు చంద్రబాబు.
సంక్రాంతికి ముందు లేదా తరువాత ....
మరో 40 రోజుల్లో అసెంబ్లీ సహ అన్ని డిజైన్లు పూర్తి అయిపోతాయని చంద్రబాబు అంటున్నారు. రాబోయే సంక్రాంతికి ముందు లేదా తరువాత అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం చేస్తామని సీఎం వెల్లడించారు. లండన్ లో నార్మన్ పోస్టర్ ప్రతినిధుల తో జరిగిన చర్చల వివరాలను మీడియా తో పంచుకున్నారు ఆయన. అయితే ప్రజాభిప్రాయం కోరుతూ సోషల్ మీడియా లో ఉంచిన డిజైన్లలో వేటిని ఎంపిక చేశారో మాత్రం ఇంకా తెలియచేయలేదు. తెలుగుదనం, ఆధునికత కలబోసి ఉండాలనే డిజైన్లు ఆలస్యం అయ్యాయి అన్నారు బాబు. మొత్తానికి అమరావతి డిజైన్ల విషయంలో రాజమౌళి మాత్రం చంద్రబాబు దగ్గర నూటికి నూరు మార్కులు వేయించుకుని తనకు ఈ రంగంలో కూడా తిరుగులేదని నిరూపించుకోవడం విశేషం.
- Tags
- రాజమౌళి

