Fri Apr 10 2026 13:02:33 GMT+0530 (India Standard Time)
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫైర్

అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు సాయంత్రం ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా దగ్దమయిందని తెలుస్తోంది. రాజుగారి గది సెట్టింగ్ కూడా కాలిపోయినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో పెద్దయెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు మొత్తం ఐదు ఫైర్ ఇంజన్లు ప్రయత్నంచేస్తున్నాయి. స్టూడియో సిబ్బందిని, షూటింగ్ లో ఉన్న నటీనటులను స్టూడియో నుంచి బయటకు పంపించివేశారు.
Next Story

