Fri Feb 06 2026 00:12:06 GMT+0000 (Coordinated Universal Time)
అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూత

అతిలోక సుందరి శ్రీదేవి కన్ను మూశారు. నిన్నఅర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. దుబాయ్ లో ఒక పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే గుండెపోటుతో మరణించారు. టాలివుడ్, బాలివుడ్ లలో దాదాపు 260 సినిమాల్లో శ్రీదేవి నటించారు. 1996లో శ్రీదేవి బోని కపూర్ ను వివాహం చేసుకున్నారు. 1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అన్ని భాషల్లో శ్రీదేవి నటించారు. పద్మశ్రీ అవార్డు కూడా శ్రీదేవి సాధించారు. 15 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. శ్రీదేవి మృతితో ఇటు టాలివుడ్, బాలివుడ్ లో విషాదం అలుముకుంది. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు.
- Tags
- శ్రీదేవి
Next Story

