Mon Apr 21 2025 20:18:25 GMT+0000 (Coordinated Universal Time)
అభ్యర్థుల జాబితా రెడీ : వైఎస్సార్టీపీ
వైఎస్సార్టీపీ గత నాలుగు రోజుల నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది

వైఎస్సార్టీపీ గత నాలుగు రోజుల నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రామిరెడ్డి తెలిపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు నుంచి పది దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. ప్రజల్లో షర్మిల పట్ల ఉన్న అభిమానంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ అద్భుతం సృష్టించబోతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. అన్ని నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకూ 377 దరఖాస్తులు వచ్చాయన్న ఆయన అత్యధికంగా ఎల్.బి.నగర్ నుంచి ఎక్కువ వచ్చాయని ఆయన తెలిపారు.
రెండు రోజులు మాత్రమే...
రేపు, ఎల్లుండి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్లో సీటు రాని వారు కూడా షర్మిల పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన తెలిపారు. ఎల్.బి.నగర్ నుంచే పది దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మిగిలిన పార్టీల్లో సీట్లు దొరకని వారు కూడా తమ పార్టీవైపు చూస్తున్నారని అన్నారు. మేనిఫేస్టోను కూడా త్వరలోనే రూపొందించి ప్రజల ముందు నుంచి ఉంచుతామని చెప్పారు. షర్మిల పాల్గొనే బహిరంగ సభల వేదికలను కూడా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ప్రభంజనం సృష్టించబోతుందని ఆయన తెలిపారు.
Next Story