Sun Feb 01 2026 09:51:03 GMT+0000 (Coordinated Universal Time)
పాదయాత్రలో ప్రభుత్వంపై ఫైర్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. షర్మిల పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుంది

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. షర్మిల పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుంది. ఈరోజు ఉదయం ఆగపేటలో ప్రారంభమైన పాదయాత్ర నర్మెట్ట, మరియాపురం, అక్కరాజుపల్లి వరకూ కొనసాగనుంది. అక్కడ భోజన విరామం కోసం ఆగుతారు. అనంతరం అక్కరాజు పల్లి నుంచి బయలుదేరి తరిగొప్పుల, లీపురం, పోతారం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రి బస అక్కడే చేయనున్నారు.
పథకాలన్నింటినీ...
కాగా వైఎస్ షర్మిల తన పాదయాత్రలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నియంత పాలన తెలంగాణలో అంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గమూ సంతోషకరంగా లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కేసీఆర్ ర్దదు చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతున్నా ప్రతిపక్షాలు మిన్నకుండి పోవడం అన్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు.
Next Story

