Fri Mar 20 2026 16:07:31 GMT+0530 (India Standard Time)
గవర్నర్ వద్దకు నేడు షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ను కలవనున్నారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ను కలవనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆమె రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. తన అరెస్ట్ లో పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్ షర్మిల గవర్నర్ దృష్టికి తేనున్నారు. గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా ఖరారయింది.
బస్సు తగులపెట్టేందుకు...
దీంతో పాటు తాను ఇప్పటికే 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని, అయితే నర్సంపేటలో తాను బస చేసే బస్సును టీఆర్ఎస్ కార్యకర్తలు తగులపెట్టేందుకు ప్రయత్నించిన వీడియోలను, ఫొటోలను కూడా గవర్నర్ కు ఇవ్వనున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై గవర్నర్ ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే.
Next Story

