Sun Dec 07 2025 13:02:52 GMT+0000 (Coordinated Universal Time)
రేపు రాజ్‌భవన్ కు షర్మిల
రేపు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కలవనున్నారు.

రేపు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కలవనున్నారు. ఈ మేరకు ఆమెకు అపాయింట్మెంట్ లభించింది. రేపు ఉదయం 11.30 గంటలకు షర్మిల రాజ్ భవన్ కు వెళ్లి గతర్నర్ తో భేటీ కానున్నారు. నిన్న పోలీసులు జరిగిన అరెస్ట్ విషయాలను వివరించనున్నారు. వైఎస్ షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.
తనపై దాడి విషయం...
తనను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా కారులో కూర్చున్నప్పుడే అమానుషంగా ట్రాఫిక్ వాహనాన్ని తన కారును కట్టి తీసుకెళ్లిన విషయాన్ని చెబుతున్నారు. అంతేకాకుండా నర్సీపట్నంలో తన రాత్రి వేళ బస చేసే బస్సు, తన వాహనాన్ని తగులపెట్టేందుకు ప్రయత్నించిన విషయాన్ని కూడా షర్మిల గవర్నర్ దృష్టికి తేనున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా గవర్నర్ కు అందజేయనున్నారు.
Next Story

