Thu Jan 29 2026 03:02:14 GMT+0000 (Coordinated Universal Time)
స్పీకర్ కు షర్మిల విజ్ఞప్తి
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ శాసనసభ స్పీకర్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ శాసనసభ స్పీకర్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తనపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంలూ నన్ను కించపరచి, నన్ను, నాతోటి మహిళలను అవమానపర్చిన సంస్కార హీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.
చర్యలు తీసుకుంటానని....
నిన్న వైఎస్ షర్మిలపై నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు తమపై వైఎస్ షర్మిల నిరాధారణ ఆరోపణలు చేస్తూ తమ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరుస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. తనకు ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదు అందిందని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Next Story

