Fri Dec 05 2025 17:35:10 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల కీలక నిర్ణయం.. అవన్నీ రద్దేనట
వైఎస్సీర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు

వైఎస్సీర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలకు కొత్తగా కో ఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ ని ఏర్పాటు చేసిన తర్వత వైఎస్ షర్మిల పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు అధికార ప్రతినిధులను కూడా షర్మిల నియమించారు.
కో -ఆర్డినేటర్లు.....
అయితే ఒక్కసారిగా తాను నియమించిన కమిటీలను రద్దు చేస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. కమిటీల స్థానంలో కో ఆర్డినేటర్లను నియమించారు. గత కొంత కాలంగా కమిటీల పనితీరును గమనించిన షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కమిటీలను రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
- Tags
- ys sharmila
- ysrtp
Next Story

