Fri Dec 05 2025 21:53:13 GMT+0000 (Coordinated Universal Time)
T-Save ఉద్యమానికి వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఈరోజు తెలంగాణ జనసమితి నేత కోదండరాంను కలవనున్నారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఈరోజు తెలంగాణ జనసమితి నేత కోదండరాంను కలవనున్నారు. అనంతరం సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో వైఎస్ షర్మిల సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ జనసమితి కార్యాలయంలో కోదండరాంతో సమావేశమై నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి పోరాటం చేద్దామని కోరనున్నారు.
నేతలతో భేటీ...
అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావుతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీపీఎం కార్యాలయంలో తమ్మినేని వీరభద్రంతో సమావేశమై నిరుద్యోగులకు అండగా నిలుద్దామని, అందరం కలసి ఉద్యమిద్దామని చెప్పనున్నారు. నిరుద్యోగుల కోసం T- SAVE ఫోరం ఏర్పాటుకు కలిసి పని చేద్దామని వైఎస్ షర్మిల నేతలను కోరనున్నారు.
Next Story

