Mon Dec 08 2025 13:27:33 GMT+0000 (Coordinated Universal Time)
మాయలోడు కేసీఆర్ ను నమ్మొద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మాయ మాటలు చెప్పేందుకు మరోసారి కేసీఆర్ వస్తున్నారని ఆయన మాటలను నమ్మవద్దని షర్మిల కోరారు. రైతు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చెప్పారు.
రైతుల సంక్షేమం కోసం....
రైతుల కోసం రైతు బంధు తప్ప మరే ఇతర పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టలేదని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రశ్నించే వారు లేకపోతే కేసీఆర్ నియంత పాలన నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని షర్మిల తెలిపారు.
- Tags
- ys sharmila
- kcr
Next Story

