Thu Feb 13 2025 00:07:25 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ వి నాటకాలు.. బూటకాలు
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. సూర్యాపేట జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్బంగా షర్మిల మార్గమధ్యంలో ప్రజలను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వ్యవసాయ రైతులు, కూలీలతో షర్మిల కొద్దిసేపు ముచ్చటించారు. వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అది బూటకమే.....
నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ ప్రకటించిన నోటిఫికేషన్లు కూడా ఒక బూటకమని షర్మిల అభివర్ణించారు. ప్రతిపక్షాలు సయితం కేసీఆర్ నిర్ణయాలను తప్పుపట్టడం లేదని, గొంతెత్తి మాట్లాడటం లేదని షర్మిల అభిప్రాయపడ్డారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. దళితులకు ఆరు ఎకరాల భూమిని పంచాలని ఆమె కోరారు.
- Tags
- ys sharmila
- kcr
Next Story