Sun Dec 07 2025 04:01:15 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల కంప్లయింట్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలోని జాతీయ మహిళ కమిషన్ ను కలిసి బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదు చేశారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలోని జాతీయ మహిళ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై షర్మిల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ కు అందించారు. మహిళలనే గౌరవం లేకుండా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. తాను పాదయాత్ర చేస్తుండగా తనపైన, తన వాహనాలపైన బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు.
జాతీయ మహిళ కమిషన్ కు...
బయట ఎలా తిరుగుతావో చూస్తామంటూ బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదని, రక్షణ లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఅర్, కేటీఆర్‌లు ఆడవాళ్ళు అంటే వారికి చులకన అని పేర్కొన్నారు. ఒక మంత్రి మహిళలు అంటే మరదలు తో సమానమని వ్యాఖ్యలు చేస్తారన్నారు. తాను ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వైఎస్ షర్మిల జాతీయ మహిళళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
Next Story

